హైదరాబాద్,(విజయక్రాంతి): మనం ఎంత పనిమంతులం అయినా.. చేసేందుకు పని ఇచ్చేవారు కూడా ఉండాలని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. నమ్మి పని ఇచ్చేవారు లేకపోతే... మన ప్రతిభ బయటికి రాదని, తను వెలుగులోకి రానప్పటికీ పార్టీ నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చిందన్నారు. 27 ఏళ్ల వయసులోనే కాంగ్రెస్ పార్టీ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందని, రాజకీయాల్లో కష్టంతో పాటు కొంచెం అదృష్టం కూడా ఉండాలని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
సొంత మనిషిని పక్కకు పెట్టి పీవీ నర్సింహారావు నాకు టికెట్ ఇచ్చారని, చదువు, వైద్యం, క్రీడల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టితో ఆలోచిస్తున్నారు. రాష్ట్ర ప్రజల కోసం సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే.. కేసీఆర్ కుటుంబం మాత్రం తన స్వార్థానికి వాడుకున్నారని మహేష్ గౌడ్ దుయ్యాబట్టారు. కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి ఒకే విడతలో రూ.లక్ష రుణమాఫీ కాడా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. రెండుసార్లు కూడా నాలుగు విడతల్లో రుణమాఫీ చేస్తామని ఐదేళ్లలో కూడా పూర్తి చేయలేదన్నారు. కులగణన చేపట్టి జనాభా ప్రకారం న్యాయం చేయాలనేది రాహుల్ గాంధీ ఆశయమని టీపీసీసీ అధ్యక్షుడు గుర్తుచేశారు.