11-04-2025 06:17:36 PM
హైదరాబాద్: పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం వేల ఎకరాలు అమ్మిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Telangana PCC President Mahesh Kumar Goud) అన్నారు. గాంధీ భవన్(Gandhi Bhavan) లో శుక్రవారం నిర్వహించినా మీడియా సమావేశంలో మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. వేల ఎకరాలను కేసీఆర్(KCR) తన సొంత మనుషులకు కట్టబెట్టారని విమర్శించారు. బీఆర్ఎస్(BRS) చేసినా భూదోపిడీపై బహిరంగ చర్చకు కేటీఆర్ సిద్దమా..? అని సవాల్ విసిరారు. హైదరాబాద్ చుట్టూ వేల ఎకరాలను అయినవారికి అప్పనంగా అమ్ముకున్నారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
కంచ గచ్చిబౌలి భూముల గురించి పదేళ్ల పాటు ఎందుకు పోరాడలేదని, హెచ్‌సీయూ భూములైతే కోర్టు వివాదంలో ఉండగా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఐఎంజీ సంస్థ బిల్లీరావుతో కమీషన్ మాట్లడుకుని పట్టించుకోలేదని, వేల కోట్ల కమీషన్ పోయిందనే అక్కసుతో కేటీఆర్ మాట్లాడుతున్నారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సుప్రీంకోర్టులో పోరాడి 400 ఎకరాలను సాధించిందని, ఈ ప్రభుత్వం కాపాడుకుంటే 400 ఎకరాలు ఐఎంజీ చేతికి వెళ్లి ఉండేదని పేర్కొన్నారు. 400 ఎకరాల్లో కంపెనీలు నిర్మిస్తే... ప్రజలకు లక్షల ఉద్యోగాలు వస్తాయని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.