హైదరాబాద్,(విజయక్రాంతి): సినీ నటుడు అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వెళ్లడం వల్లే తొక్కిసలాట జరిగిందని ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణం పోయిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆసుపత్రిలో బాలుడు ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు. ఏ ఒక్క హీరో ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించలేదని, ఒక రాత్రి జైలులో ఉండి బయటకు వచ్చిన అల్లు అర్జున్ ను మాత్రం సినీ పరిశ్రమల్లో ఉన్న కళాకారులందరు కలిశారని మండిపడ్డారు. కళాకారులను ప్రోత్సహించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని, మెగాస్టార్ చిరంజీవికి కేంద్రమంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ అని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.