calender_icon.png 22 January, 2025 | 3:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్..?

03-07-2024 12:42:26 AM

ఖర్గేతో భేటీ 

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి):  పీసీసీ నూతన అధ్యక్షుడు ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. పార్టీ అధిష్ఠానం కొత్త బాస్ నియామకంపై కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌గౌడ్  ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఖర్గేను  మహేష్‌గౌడ్  కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పీసీసీ చీఫ్‌గా ఆయన పేరు ఫైనల్ అయిందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. పీసీసీ చీఫ్ పదవి బీసీ వర్గానికి ఇస్తారని మొదటి నుంచి చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. కొత్త బాస్ విషయంలో  అధిష్ఠానం ముఖ్యనేతల  అభిప్రాయం తీసుకున్నట్టు తెలిసింది.