16-04-2025 09:03:33 AM
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) కార్యాలయం వద్ద రేపు ధర్నా చేయనున్నట్లు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గురువారం ఉదయం 10 గంటలకు ఈడీ కార్యాలయం ముట్టడిస్తామని ఆయన తెలిపారు. నేషనల్ హెరాల్డ్ కేసు(National Herald corruption case)లో ఈడీ వైఖరిని నిరసిస్తూ ధర్నాకు దిగబోతున్నట్లు మహేశ్ కుమార్ గౌడ్(Bomma Mahesh Kumar Goud) తెలిపారు. ఛార్జిషీట్లలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను కక్షపూరితంగా చేర్చారని ఆయన ఆరోపించారు. రాజకీయ కక్షసాధింపులను నిరసిస్తూ ధర్నాకు పూనుకున్నామని టీపీసీసీ అధ్యక్షఉడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో సోనియా గాంధీ(Sonia Gandhi), రాహుల్ గాంధీలను ఏ1, ఏ2 నిందితులుగా పేర్కొంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్ దాఖలు చేసింది. ఏప్రిల్ 9న సమర్పించిన చార్జిషీట్‌ను ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే సమీక్షించారు. ఈ కేసును ఏప్రిల్ 25, 2025న విచారణకు షెడ్యూల్ చేశారు. ఈ చార్జిషీట్‌లో కాంగ్రెస్ నేత సామ్ పిట్రోడా, సుమన్ దూబేలను కూడా నిందితులుగా పేర్కొన్నారు. “ప్రాసిక్యూషన్ ఫిర్యాదును ఏప్రిల్ 25, 2025న విచారణకు సమీక్షిస్తారు. ఈ సందర్భంగా ఈడీ తరపు ప్రత్యేక న్యాయవాది, దర్యాప్తు అధికారి కేసు డైరీలను కోర్టు సమీక్ష కోసం సమర్పిస్తారు” అని న్యాయమూర్తి చెప్పారు. ఏప్రిల్ 12న, కాంగ్రెస్ నియంత్రణలో ఉన్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (Associated Journal Limited) కు సంబంధించిన మనీలాండరింగ్ కేసుతో ముడిపడి ఉన్న రూ.661 కోట్ల విలువైన స్థిరాస్తులను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రకటించింది.