calender_icon.png 20 April, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహేశ్ మెచ్చిన మాటల రచయిత!

14-04-2025 12:24:58 AM

మహేశ్‌బాబు, రాజమౌళి కాంబోలో ప్రస్తుతం ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమా కోసం దాదాపు రూ.1200 కోట్ల బడ్జెట్ కేటాయిచినట్టు సమాచారం. ప్రియాంక చోప్రా సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నటీనటులు ఇందులో భాగం కాబోతున్నారు.

మొదట్నుంచీ పాన్ వరల్డ్ లెవల్‌లో సినీప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొన్న ఈ ప్రాజెక్టు గురించి తాజాగా ఆసక్తికర వార్త ఒకటి బయటికొచ్చింది. ఈ సినిమాకు దర్శకుడు దేవ కట్టా మాటలు రాస్తున్నాడట. ఇంతకుముందు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలకు ఎం రత్నం మాటలు రాసేవారు. రాజమౌళి సోదరుడు కంచి కూడా డైలాగ్స్ అందించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’కు సాయిమాధవ్ బుర్రా మాటల రచయితగా పనిచేశారు.

అయితే ‘బాహుబలి1’ యుద్ధం సీన్‌లో వచ్చే ‘ఏది మరణం..’ డైలాగ్‌ను దేవ కట్టానే రాశారని టాక్. తన సినిమాలో ఇలాంటి డైలాగ్స్ ఉండాలనే ఉద్దేశంతోనే మహేశ్‌బాబు.. స్వయంగా దేవా కావాలని కోరినట్టు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ‘వెన్నెల’ చిత్రంతో దర్శకుడిగా మారిన దేవ కట్టా.. తర్వాత ‘ప్రస్థానం’తో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నారు. నాగచైతన్యతో ‘ఆటోనగర్ సూర్య’ తీశారు. చివరిగా సాయిదుర్గాతేజ్ తో చేసిన ‘రిపబ్లిక్’ చిత్రం కూడా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. 

చుర కత్తుల్లాంటి డైలాగ్స్ రాయడంలో దేవ కట్టాది పెట్టింది పేరు. ఇప్పుడు మహేశ్ సినిమాకు మాటలు రాస్తుండడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు మరింత పెరిగి పోయాయి. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ చెప్పినట్టు ఇది ఫారెస్ట్ యాక్షన్ అడ్వెం చర్ అయినప్పటికీ.. ఇందులో యాక్షన్ సన్నివేశాలతోపాటు డైలాగ్స్ విషయంలో చాలా శ్రద్ధ వహిస్తున్నట్టు తెలుస్తోంది.