calender_icon.png 13 March, 2025 | 9:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సివిల్స్ సాధించడమే లక్ష్యం గంట మహేశ్ గౌడ్

13-03-2025 01:47:12 AM

మంథని మార్చి 1 టు (విజయ క్రాంతి) గ్రూప్ 2లో 143 ర్యాంక్ సాధించి తన సత్తా చాటాడు ముత్తారం మండలంలోని సీతంపల్లికి గ్రామానికి చెందిన గంట మహేష్ గౌడ్ పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని సీతంపల్లి గ్రామానికి చెందిన గంట రాజా గౌడ్ కుమారుడు గంట మహేష్ గౌడ్ గ్రూప్ 2 ఫలితాలలో రాష్ట్ర వ్యాప్తంగా 143 ర్యాంక్ సాధించాడు.

కాగా ఇంతకీ ముందు కూడా గ్రూప్ 4 ఫలితాలలో విజయం సాధించి ప్రస్తుతం పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయంలో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ లో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. పట్టుదలతో సివిల్స్ కోసం పట్టు వదలైన విక్రమార్కుడిల మహేష్ గౌడ్ మొదటి దఫా లో సివిల్స్  రాకపోవడంతో గ్రూపులో విజయం సాధించారు.

జేఎన్టీయూ కళాశాలలో మైనింగ్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన మహేష్ గౌడ్ ఇంటర్మీడియట్ విద్యను మంథనిలో నుంచి చైతన్య జూనియర్ కళాశాలలో చదివి ఇంటర్మీడియట్ లో జిల్లాలో ప్రథమ స్థానం సదించాడు. ఎప్పటికైనా సివిల్స్ సదించాలని లక్ష్యంతో ప్రిపేర్ అవుతున్నట్లు మహేష్ గౌడ్ తెలిపారు. మహేష్ గౌడ్ కు డిప్యూటీ తాసిల్దార్ కానీ, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్  ఉద్యోగం లభించే అవకాశం ఉందన్నారు. తన చదువు కోసం సహకరించిన ప్రతి ఒక్కరికి మహేష్ గారు కృతజ్ఞతలు తెలిపారు.