నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం మహేష్‌గౌడ్
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
కామారెడ్డి, మే 24 (విజయక్రాంతి): నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం టి పి సి సి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సాధారణ నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టి కష్టాన్ని నమ్ముకుని నేను రాత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏం చేస్తే ఆయన పట్టుదలకు నిదర్శనం అన్నారు రాజకీయాలు అంటే పదవులు కాదు ప్రజలకు సేవ చేయడమే అనే భావనతో ముందుకు సాగే మహేష్ కుమార్ గౌడ్ ఎప్పుడు ప్రజల సమస్యలపై స్పందించిన నాయకుడిగా గుర్తింపు పొందారు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఐదేని సందీప్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు పార్టీకి మరింత ఉన్నతమైన సేవలు టీపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అందించాలని ఆ భగవంతుని కోరుతున్నట్లు తెలిపారు.
ఆయా కార్యక్రమాల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి నిమ్మ విజయకుమార్ రెడ్డి, జూలూరి సుధాకర్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పంపరి లక్ష్మణ్, క్రీడా అధ్యక్షులు నర్స గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ గడ్డమీద మహేష్, మాజీ కౌన్సిలర్ జమీల్, చింతల రవీందర్ గౌడ్, బల్ల శ్రీనివాస్, సునీల్ గౌడ్, రాహుల్, బాబి, మెహర్ బాబా గౌడ్, అరుణ్, హైమద్, పాండు, శ్రీకాంత్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాజా గౌడ్, ఇప్ప శ్రీనివాస్, అంజాద్, సత్యం, అన్వర్, ముబా షరీఫ్, సురేష్, మసూద్, రవి పాటిల్, శంకర్, భాస్కర్, భరత్, గంగాధర్ పాల్గొన్నారు.






