calender_icon.png 5 February, 2025 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మణికర్ణికా ఘాట్‌లో మహేశ్ ఎంట్రీ!

05-02-2025 12:04:38 AM

రాజమౌళి కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’. ఈ సినిమా షూటింగ్ సైలెంట్‌గా ప్రారంభమైంది. ఇందులో ప్రియాంక చోప్రా ముఖ్య పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ప్రియాంక తన సోదరుడి వివాహ వేడుకలో బిజీగా ఉండటంతో ఆమె లేని సన్నివేశాలను రాజమౌళి తెరకెక్కిస్తున్నారు.

అయితే ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని రాజమౌళి పైలట్ మోడల్‌లో రూపొందిస్తున్నారట. పైలెట్ మోడల్ అంటే ఫైనల్ రష్ సరిగా లేకుంటే ఆయా సన్నివేశాలను తొలగించేస్తారు. దీనిలో నటించే వారి నుంచి ముందుగానే అంగీకారం తీసుకుని మరీ రాజమౌళి అలా రూపొందిస్తున్నారట.

ఇక ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా మణికర్ణికా ఘాట్ రూపంలో సెట్‌ను నిర్మించారట. ఈ ఘాట్‌లో ఫ్లాష్ బ్యాక్ సీన్లు, మహేశ్ ఎంట్రీ సీన్ తెరకెక్కిస్తారట.

సినిమా చిత్రీకరణకు సంబంధించి అల్యూమి నియం ఫ్యాక్టరీలో ఇప్పటికే కీలక సెట్లు అన్నీ పూర్తయ్యాయని తెలుస్తోంది. అడవి నేపథ్యానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను మాత్రం ఆఫ్రికాలో చిత్రీకరిస్తారట. నటీనటుల ఎంపిక ఇంకా కొనసాగుతోంది. ఈ ప్రక్రియ తర్వాతే షెడ్యూల్స్‌ను ప్లాన్ చేస్తారట.