calender_icon.png 6 April, 2025 | 1:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అబిడ్స్‌లో మహేష్ బ్యాంక్ ఏటీఎం

05-04-2025 12:50:35 AM

ప్రారంభించిన బ్యాంకు అధికారులు

హైదరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): ప్రముఖ మల్టీ స్టేట్ షెడ్యూల్ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ మహేష్ కో -ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ శుక్రవారం అబిడ్స్ బ్రాంచీలో కస్టమర్ల భద్రతా లావాదేవీల కోసం అప్‌గ్రేడ్ చేసిన ఏటీఎంను ఏర్పాటు చేసింది. ఏటీఎంను భగవతి దేవి బల్ద్వా, రామ్ నారా యణ బోగా ప్రారంభించారు. అద్భుతమైన సేవలను అందిస్తున్నందుకు సిబ్బందిని భగవతి దేవి బల్ద్వా అభినందించారు.

రామ్ నారాయణ బోగా మాట్లాడుతూ.. కస్టమర్ల సౌలభ్యం, భద్రత కోసం అధిక నాణ్యత గల, నూతన సాంకేతిక కలిగిన ఏటీఎంను ప్రారంభించామన్నారు. వినయ్ బల్దవా, ప్రీతం కుమార్ అగర్వాల్, రవి అగర్వాల్ మాట్లాడుతూ.. మహేష్ బ్యాంక్ తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, రాజస్థాన్ 4 రాష్ట్రాలను కలుపుకొని 45 శాఖలతో పనిచేస్తోందన్నారు.