calender_icon.png 29 December, 2024 | 3:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహేశ్ చిత్రంలో హీరోయిన్‌గా..

29-12-2024 12:00:00 AM

ప్రస్తుతం మహేశ్ బాబు, రాజమౌళి సినిమా గురించే చర్చంతా. ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి లేదంటే మహేశ్ ఇప్పటి వరకూ ఏమీ చెప్పలేదు కానీ నెట్టింట ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గురించి రెండు, మూడు పేర్లు గట్టిగానే వినిపించాయి. తాజాగా హీరోయిన్‌ను ఫైనల్ చేశారంటూ ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ సినిమాలో నటించనుందట.

చిత్రంలోని పాత్రకు ఆమె అయితే బాగుంటుందని భావించిన చిత్ర యూనిట్ ఆమెను ఎంపిక చేసిందని నెట్టింట వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమా ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ పేరుతో పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతోంది. ఈ క్రమంలోనే ప్రియాంక చోప్రా సైతం పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించి ఉండటంతో ఆమెను హీరోయిన్‌గా చిత్ర యూనిట్ ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. దర్శకుడు రాజమౌళి సైతం ఆమెను పలుమార్లు కలిసినట్టు బాలీవుడ్ మీడియా కూడా వెల్లడించింది. ఈ సినిమాకు ప్రియాంక సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని టాక్. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ వర్క్ ప్రారంభమైంది.