మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి) : మాజీ ఎమ్మెల్యే నరేం దర్‌రెడ్డి జైలుకు వెళ్లడం వెనక మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి హస్తం ఉందని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్లో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్నం కు టుంబంపై మహేందర్‌రెడ్డికి నిజంగా ప్రేమ ఉంటే ఎమ్మెల్సీ, చీఫ్ విప్ పదవికి రాజీనామా చేయాలని డిమాం డ్ చేశారు.
లగచర్ల చుట్టుపక్కల అధిక దిగుబడినిచ్చే పొలాలు ఉన్నాయని తెలిసి కూడా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నదన్నారు. అధికారులకు పోలీసులు ఎందుకు భద్రత కల్పించలేదని, అది తోపులాటే తప్పా కుట్ర కాదన్నారు. ఘటన జరిగిప్పుడు నరేందర్‌రెడ్డి అక్కడ లేకున్నా జైల్లో వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.