నిర్మల్ (విజయక్రాంతి): పిడిఎస్యు రాష్ట్ర కోశాధికారిగా నిర్మల్ జిల్లాకు చెందిన మహేందర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పిడిఎస్సి నాయకులు తెలిపారు. ఖమ్మం జిల్లాలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో నూతన కమిటీని ప్రకటించగా నిర్మల్ జిల్లాకు చెందిన మహేందర్ ను రాష్ట్ర కోశాధికారిగా నియమించడంతో నిర్మల్ జిల్లాకు చెందిన పిడిఎఫ్ నాయకులు వెంకట్ అరుణ్ ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర కమిటీలో తనకు అవకాశం ఇచ్చిన రాష్ట్ర కమిటీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.