08-04-2025 04:34:08 PM
ఎస్సై, కానిస్టేబుల్, టెట్, డిఎస్సి అభ్యర్థులకు ఉచిత శిక్షణకు శ్రీకారం చెబుతున్నాం..
అందరికీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రజాపాలన లక్ష్యం..
విలేకరుల సమావేశంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ తో పాటు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. ప్రతి కుటుంబంలోని ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ప్రభుత్వం వేలాది నోటిఫికేషనులను జారీ చేసేందుకు అవసరమైన కసరత్తు చేస్తుందని పేర్కొన్నారు. యూనివర్సిటీలలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించడం జరుగుతుందని తెలిపారు.
ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ప్రతి నైపుణ్య శిక్షణ కేంద్రంలో 250 మందికి శిక్షణ పూర్తి చేయడం జరిగిందని, మరో 250 మందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. బాలుర కళాశాలలో నీట్, ఎంసెట్ శిక్షణ ఉచితంగా అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే మహబూబ్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాల నిరుద్యోగులకు ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు పోటీ పరీక్షలకు సంబంధించి ఉచితంగా శిక్షణను ఈ నెల 16వ తేదీ నుంచి శ్రీకారం చూస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు ఫారాన్ని పూర్తిచేసి అందించాలని పేర్కొన్నారు. హైదరాబాద్ లో వివిధ సబ్జెక్టులలో నిష్ణాతులైన అధ్యాపకులతో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు.
250 మంది మహిళలకు మూడు కోర్సులలో శిక్షలు ఇవ్వడం జరుగుతుందని, రెండో బ్యాచ్ శిక్షణ ప్రారంభమైందని తెలిపారు. 100 మంది విద్యార్థులకు నీట్, ఎంసెట్ కి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. మహబూబ్ నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో ఎస్సై, కానిస్టేబుల్ కు ప్రత్యేక శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. త్వరలో డిఎస్సీ, గ్రూప్ 1 2 3 4 తో పాటు, విఆర్ఎ, విఆర్ఓ నియమాకాలకు ఉచిత శిక్షణ అందిస్తామన్నారు.
ముల్కీ ఉద్యమం స్ఫూర్తితో ముందుకు సాగుదాం: రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్
స్థానికులకే పని కనిపించాలనే ఉద్దేశంతో తెలంగాణలో గత 150 ఏళ్ల క్రితమే ముల్కీ ఉద్యమాన్ని చేపట్టిందని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ అన్నారు. అదే స్ఫూర్తితో మహబూబ్ నగర్ లో వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణ ఉచితంగా అందించేందుకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎంతో సంకల్పంతో ముందుకు రావడం జరిగిందన్నారు. ప్రతి కుటుంబానికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే అన్ని రంగాల్లో ఆ కుటుంబం ఆర్థికంగా ముందుకు సాగుతుందని తెలిపారు.
ఈ శిక్షణను ప్రతి ఒక్కరు అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వేలాది నోటిఫికేషన్ల వేసేందుకు గాను ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందన్నారు. యూనివర్సిటీలకు సంబంధించి ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. విద్య, నైపుణ్యం శిక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముల్కీ ఉద్యమంగా స్థానికులకే ఉపాధి అవకాశాలు కల్పించడం అనే అంశాన్ని తెరపైకి తీసుకుపోవడం జరిగిందని తెలియజేశారు.
జ్ఞాన తెలంగాణగా మార్చవలసిన అవసరం మనపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోమహబూబ్ నగర్ ఫస్ట్ ద్వారా ఉద్యోగార్థులకు శిక్షణ ఇచ్చే శిక్షకులు రవికుమార్ లోకై (ఆర్థమెటిక్స్), గాది బాలరాజ్, (గణిత శాస్త్రం), నాని యాదవ్(ఆర్థమెటిక్స్), బి రాజేంద్ర చారి(ఇంగ్లీష్), రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ రియాజ్, టి పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, తదితరులు పాల్గొన్నారు.