calender_icon.png 6 October, 2024 | 2:01 PM

అర్థం పడటం లేని రాద్ధాంతం..

04-09-2024 12:59:09 PM

అక్రమ నిర్మాణాలు ఎవరు చేపట్టారో తెలిస్తే కదా నోటీసులు ఇచ్చేది..

తెలియని పేర్లు మీద నోటీసులు ఎలా ఇవ్వాలి 

మా శ్రమంత మహబూబ్ నగర్ అభివృద్ధి కోసమే 

-మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ 

మహబూబ్ నగర్, (విజయ క్రాంతి): పట్టణ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నామని మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ అన్నారు. అక్రమ నిర్మాణాలు తొలగించడం పట్ల కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరుపై విజయక్రాంతితో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ పలు అంశాలను తెలియజేశారు. ఎవరు పడితే వారు ప్రభుత్వ భూమిలో ఇండ్లు నిర్మించుకొని ఇవి మావి అంటూ కాలం వెళ్ళదిస్తే ఎంతవరకు సమంజసం అని అసహనం వ్యక్తం చేశారు. నిజమైన లబ్ధిదారులు ఉంటే వారికి కచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లలో న్యాయం చేస్తామని తెలియజేశారు. మహబూబ్నగర్ మున్సిపాలిటీ కానీ రెవెన్యూ అధికారులు కానీ ఎక్కడైనా వారికి పత్రాలు అధికారికంగా ఇచ్చినట్లు ఉంటే చూపించాలని తెలియజేశారు.

నకిలీ పత్రాలను పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ వారి ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టి ఇది మా భూమి ఇది మా ఇల్లు అంటూ కాలం వెల్లదీస్తే ఎట్ల సరిపోతుందని పేర్కొన్నారు. మహబూబ్నగర్ పట్టణంలో భారీ వర్షం నమోదైతే ఒక్కసారిగా ఇండ్లలోకి వరద నీరు పోతుందని, ఎక్కడపడితే అక్కడ పరిధిలో ఉన్న భూముల్లో కూడా నిర్మాణాలు చేపడితే ఎవరు ఆపాలని ప్రశ్నించారు. భవిష్యత్తు బాగుండాలని ఉద్దేశంతోటే ఈ నిర్ణయం తీసుకున్నామని నిజమైన లబ్ధిదారులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వమని పేర్కొన్నారు. నకిలీ పత్రాలను ఇప్పించే వారి నమ్మి పేదవారు ఎవరు మోసపోకూడదని ఇకనైనా ఆ వివాదాలకు ముగింపు పలుకుదామని పేర్కొన్నారు.

ఎవరో రాజకీయం కోసం కావాలని వారి వ్యక్తిగత ఎదుగుదల కోసం ఎన్నో ఆరోపణలు చేస్తారని వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలియజేశారు. భవిష్యత్తులో ఎక్కడ కూడా ముప్పు ప్రాంతాలకు గురికాకుండా పక్క ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని ఈ విషయంపై మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎంతో ఆలోచనతో ఉన్నారని తెలియజేశారు. అక్రమ నిర్మాణాలు అని చేతకు ప్రతి ఒక్కరు కలిసి రావాలని అందరం కలిస్తేనే అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని సూచించారు.