calender_icon.png 1 November, 2024 | 3:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎవరు ఎవరిపై కేసులు పెట్టిండ్రు

01-11-2024 01:51:52 PM

అత్యధికంగా బీసీలపై కేసులు పెట్టిన ఘనత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కి దక్కుతుంది 

ఒకప్పుడు వరద భాస్కరపై కేసు పెట్టి తన వైపు మలుపుకున్న ఘనత నీది

విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు సిరాజ్ ఖాద్రీ 

మహబూబ్ నగర్, (విజయక్రాంతి) : ఎవరు పై ఎవరు కేసులు పెట్టిండ్రు అన్ని తెలిసి ఏం మాట్లాడుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలిపిన స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీ కల్పించడం జరిగిందని తెలిపారు. గత పది సంవత్సరాల క్రితం ఒక్కరోజైనా పోలీస్ స్టేషన్లో ముందు ఎవరైనా మహబూబ్ నగర్ నిరసన తెలిపిన ఘటనలో జరిగాయా అని ప్రశ్నించారు. రాజకీయ రగడకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గతంలో పోలీస్ లను వాడుకొని ఎంతోమంది ఇబ్బందులకు గురిచేసారని తెలియజేశారు.

ప్రతి విషయం తమకు తెలుసని ఏదో మాట్లాడాలని ఏదో అలజడి సృష్టించాలని ప్రజల్లో నమ్మకం పెంచాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఎవరు నమ్మబోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఎవరు ఏం చేశారో బాగా తెలుసని స్వేచ్ఛగా మహబూబ్ నగర్ లో తప్పు చేస్తే వారి గూర్చి మాట్లాడుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించిందని తెలిపారు. వరద భాస్కర అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడితే పోలీసులు అతన్ని పోలీస్ స్టేషన్కు రప్పించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఒకప్పుడు అదే వరద భాస్కరపై మీరు కేసులు పెట్టించి మీ వైపు తిప్పుకున్న విషయాలను మీరు మర్చిపోయారా అని ప్రశ్నించారు. మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం అవసరమైతే సరైన సూచనలు సలహాలు ఇవ్వాలి తప్ప, ఇష్టం సారంగా మాట్లాడి ప్రజల్లో మరింత బలహీన పడకూడదని సూచన చేశారు. ప్రతి విషయాన్ని పూర్తిస్థాయిలో సమగ్రంగా ఆలోచించి ప్రజలకు మంచి జరుగుతుందా ? జరగదా ?   అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగడం జరుగుతుందని తెలియజేశారు. 

తప్పుడు పోస్టులు పెడితే.. తాటతీస్తాం.. ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ 

ఏదో ప్రజలకు మంచి చేయాలనే తపనతో తాము ముందుకు సాగుతున్నామని, తప్పుడు పోస్టులు పెట్టి అలజ రెడ్డి సృష్టించాలని చూస్తే తాటతీస్తామని మూఢ చేర్మెన్ లక్ష్మణ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలుపుకునే హక్కు కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛగా ఇవ్వడం జరిగిందని ఎవ్వరిని అణిచివేతకు గురి చేయడం లేదని తెలిపారు. గత పది నెలల క్రితం వరకు వెళ్లి చూస్తే మీరు ఎవరిని ఏమి చేశారో అర్థం అవుతుందని మాజీ మంత్రి ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచన చేయవలసిన అవసరం ఉందన్నారు. పోలీస్ స్టేషన్లో ముందు కూర్చొని నిరసన తెలిపితే తప్పు ఒప్పు అవుతుందా అని ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేయాలని నాయకుడు ప్రజల గురించి ఆలోచిస్తాడని, ద్రోహం చేయాలని నాయకుడే వారి సంక్షేమం కోసం మాత్రమే ఆలోచిస్తారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం పార్టీని, నిరంతరం ప్రజల మేలుకోసమే శ్రమిస్తుందని తెలియజేశారు. 

అనవసర రాద్ధాంతం చేయకూడదు. : సిరాజ్ ఖాద్రి :  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు 

ప్రశాంతంగా ఉన్న పాలమూరుకు లో మరోసారి అలజడి సృష్టించాలని ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రి అన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేక ఏదో అలజడి సృష్టించాలని చూస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై చెప్పకూడని పదజాలంతో కూడిన పోస్టులు పెడితే వర్ధ భాస్కర్ ను పోలీసులు కౌన్సిలింగ్ చేయడం జరిగిందని తెలిపారు. అర్ధ భాస్కర్ ను కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి తీసుకుంటుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎట్టి పరిస్థితుల్లో అతన్ని సంక్షేమం  కోరడం లేదని తెలిపారు. అందర్నీ మంచి మార్గంలో నడిపిస్తూ ప్రతి ఒక్కరిని ఉన్నత స్థాయికి తీసుకుపోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతుందని తెలియజేశారు. మాజీమంత్రి ఇష్టానుసారంగా ముందుకు సాగితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, జాజిమొగ్గ నరసింహులు, వెంకటేష్ తదితరులు ఉన్నారు.