మహారాష్ట్ర,(విజయక్రాంతి): మహరాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం సాయంత్రం 5.30 గంటలకు ముంబయిలోని ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మహాయుతి నేతలు ఫడ్నవీస్, ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ ను బుధవారం కలిశారు. ఫడ్నవీస్ కు మద్దతిస్తూ గవర్నర్ కు ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ లేఖను అందజేశారు. మహాయుతి నేతలను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు.
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ఉంటారని, కేబినెట్ లో ఏక్ నాథ్ షిండే కీలకపాత్ర పోషిస్తారని ఫడ్నవీస్ పేర్కొన్నారు. మహారాష్ట్ర సీఎం ప్రమాణస్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. సీఎం ప్రమాణస్వీకరానికి ఇప్పటికే భారీగా ఏర్పాటు చేస్తున్నారు. కాగా, మహారాష్ట్ర సీఎం ఎవరన్న దానిపై 10 రోజుల సస్పెన్స్ కు నేటితో తెర పడింది.