calender_icon.png 24 November, 2024 | 5:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి కోసమే మహాయుతికి పట్టం

24-11-2024 04:09:12 AM

 ఎంపీ ఈటల రాజేందర్

హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): మహారాష్ర్టను గొప్పగా అభివృద్ధి చేసుకునేందుకు అక్కడి ప్రజలు బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమికి పట్టం కట్టారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మహాలో కాంగ్రెస్ మోసాలు పనిచేయలేదని పేర్కొన్నారు. మహారాష్ట్రలో గెలుపు అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కార్యకర్తల తో కలిసి శనివారం సంబురాలు చేసుకున్న అనంతరం  మీడియాతో మాట్లాడారు.

గొప్ప మెజారిటీతో గెలిపించిన మహారాష్ర్ట ప్రజానీకానికి తెలంగాణ తరఫున అభినందనలు తెలియజేశారు. రేవంత్ రెడ్డి బృందం మహారాష్ట్రలో ప్రచారం చేస్తే.. కాంగ్రెస్ మోసం చేస్తుందని భావించిన అక్కడి ప్రజలు సరిగ్గా బుద్ధి చెప్పారని అన్నారు. మోసం,  దగాతో ఎక్కువ రోజులు సర్కారును నడపలేరని ఆయన విమర్శించారు. మహారాష్ర్ట ఎన్నికలను ఒక గుణపాఠంగా తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆయన తెలిపారు.