ముషీరాబాద్, జనవరి 2: మహవీర్ ఇంటర్నేషనల్ అపెక్స్ స్వర్ణోత్సవాలను ‘స్వర్ణోదయ’ పేరుతో ఈనెల 4, 5 తేదీలలో హైదరాబాద్ శంషాబాద్ సిటాడె ల్ కన్వెన్షన్‌లో నిర్వహిస్తున్నట్లు స్వర్ణోత్సవాల నిర్వహణ కమిటీ కన్వీనర్లు శీల్ జైన్, అజయ్ నహత, చైర్మన్ వినోద్ సంచేటి, వైస్ చైర్ పర్సన్ అర్చన నహత, కన్వీనర్ సీమా షీల్ తెలిపారు.
ఈ మేరకు గురువారం బషీర్‌బాగ్‌లో స్వర్ణోత్సవాలకు సంబంధించిన బ్రోచర్ ను వారు ఆవిష్కరించారు. అనంతర వారు మాట్లాడుతూ.. ఈనెల 4న జరిగే స్వర్ణోత్సవాలను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్కమార్క ప్రారంభిస్తారని తెలిపారు.
అదేరోజు సాయంత్రం జరిగే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే సంజీవ్‌రెడ్డి పాల్గొంటారని తెలిపారు. విద్యా, వైద్యం, మహిళా శిశు సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ తదితర రంగాలలో ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం మహావీర్ ఇంటర్నేషనల్ దేశం లో 350 కేంద్రాలు, 150 నగరాలు, పట్టణాలలో అనేక సంక్షేమ, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని వారు వివ రించారు.
ఇప్పటికే కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద మహావీర్ ఇంటర్నేష నల్ సంస్థ ఆధ్వర్యంలో రెండు ఆస్పత్రులను నిర్వహిస్తున్నామని అన్నారు.