10-03-2025 01:08:51 AM
ఏడాదిన్నరగా ఆవిష్కరణకు నోచుకొని అంబేద్కర్, గాంధీ విగ్రహాలు
రూ. 50 లక్షలతో ముట్రాజ్ పల్లి కూడలి అభివృద్ధి పనులు
గజ్వేల్, మార్చి 9: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్ పల్లి గ్రామ కూడలిలో మంత్రి కోసం మహాత్ములు ఎదురుచూస్తున్నారు. రూ. 50 లక్షల మున్సిపల్ నిధులతో గత ఏడాది క్రితం ముట్రాజ్ పల్లి కూడలి నిర్మాణ పనులను పూర్తి చేశారు. ఈ కూడలిలో అంబేద్కర్, గాంధీ విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. మున్సిపల్ పాలకవర్గం అధికారంలో ఉన్నప్పుడే పనులు పూర్తి కావడంతో కూడలిని ప్రారంభించి విగ్రహావిష్కరణకు ఏర్పాటు చేయాలని అధికారులను స్థానిక కౌన్సిలర్లు కోరగా మంత్రిగారి చేతుల మీదుగానే ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారని చెప్పారు. దీంతో ఆవిష్కరణకు నోచుకోకుండానే అందంగా ముస్తాబైన కూడలితోపాటు విగ్రహాలు కూడా దుమ్ము పట్టి పోతున్నాయి. ఇప్పటికైనా విగ్రహాల ఆవిష్కరణ చేసి మహాత్ముల గౌరవాన్ని కాపాడాలని ముట్రాజ్ పల్లి గ్రామ ప్రజలు కోరుతున్నారు.