- జిల్లాల్లో బీఆర్‌ఎస్ నాయకుల వినూత్న నిరసన
- హామీల అమలుకు గాంధీ విగ్రహాలకు వినతులు
ఖమ్మం, కామారెడ్డి, జనవరి 30 (విజయక్రాంతి), భీమదేవరపల్లి: గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని బీఆర్‌ఎస్ నాయకులు వినూత్నంగా నిరసనగా తెలిపారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఆయా జిల్లాల్లో బీఆర్‌ఎస్ నాయకులు గాంధీ విగ్రహాలకు వినతులు అందించారు. జనవరి 30 నాటికి ప్రభుత్వం ఏర్పడి 420 రోజులు గడించిన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను నెరవేర్చేలా ఆ పార్టీ నేతలకు బుద్ధిని ప్రసాదించాలని కోరారు.
ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, వైరా, సత్తుపల్లి, మధిర, కల్లూరు,పెనుబల్లి, చింతకాని, బోనకల్ తదితర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా నాయకులు ఆర్జేసీ కృష్ణ కాంగ్రెస్ హామీలపై ప్రశ్నించారు.
ఖమ్మంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు గుండాల కృష్ణ, పగడాల నాగరాజు, మగ్బుల్, రామ్మోహన్, వలరాజు, బొమ్మెర రామ్మూర్తి పాల్గొన్నారు. సత్తుపల్లిలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కొత్తూరు ఉమ, కూసంపూడి రామారావు, దొడ్డా శంకర్‌రావు, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, పుల్లారావు తదితరులు పాలుపంచుకున్నారు.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో జడ్పీ మాజీ చైర్మన్ డాక్టర్ సుధీర్‌కుమార్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు వినతిపత్రం అందించారు. వంగ రవిందర్, జు రమేశ్, సంగ సంపత్, మండల సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాల్లోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, రామారెడ్డి, భిక్కనూర్, పిట్లం, బిచ్కుంద తదితర మండలాల్లో బీఆర్‌ఎస్ నాయకులు నిరసన తెలిపారు. ఎల్లారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, బిచ్కుందలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, కామారెడ్డిలో పట్టణ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, బాన్సువాడలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కొనసాగింది.