calender_icon.png 19 April, 2025 | 12:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి ఇల్లందు ఏరియాలో ఘనంగా మహాత్మా జ్యోతిరావ్ ఫులే 198వ జయంతి వేడుకలు

11-04-2025 08:31:32 PM

ఇల్లెందు (విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియాలోని, జెకె కాలనీ సి.ఇ.ఆర్. క్లబ్ లో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావ్ ఫులే 198వ జయంతి వేడుకలను ముఖ్య అతిధి ఏరియా జి.యం వి.కృష్ణయ్య పాల్గొన్నారు. మొదట జ్యోతిరావ్ ఫులే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మహాత్మా జ్యోతిరావ్ ఫులే 198వ జన్మదిన పురస్కరించుకొని కేక్ ని కట్ చేశారు. ఈ సందర్భముగా మాట్లాడుతూ... మహాత్మ జ్యోతిరావు పూలే ఏప్రిల్ 11.1827న పూణేలో జన్మించారన్నారు. పూలే మహిళలు అణగారిన సమాజాలకు విద్యా సమానత్వం కోసం ఎంతో పోరాటం చేశారు. ఆయన భారతదేశానికి చెందిన ప్రముఖ సామాజిక సంస్కర్త, రచయిత, పూలే మహిళలు అందరూ చదువుకోవాలని ఎంతో పోరాటం చేశారు.

అందుకే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రి భాయ్ పూలేని ఉపాధ్యాయురాలుగా నియమించాడు, అలాగే వితంతువులకు పునర్వివాహం చేయాలని ఎంతో కృషి చేశాడు. వితంతువులకు, గర్భిణీ స్త్రీల కోసం ఆశ్రమాన్ని స్థాపించాడని అని అన్నారు. ఆయన సేవలో చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధికారుల సంఘం అధ్యక్షులు బి నాగేశ్వరరావు, డిజిఎం (పర్సనల్) జీవి. మోహనరావు, ఏ జి యం. గిరిదర్ రావు, జే.కే ఓ.సి ఎస్. ఓ యం, బీసీ ఓబీసీ ఇల్లందు ఏరియా అధ్యక్షులు పులి పూర్ణచందర్, బి.సి లైజనింగ్ అధికారి నాగ శేషు, బీసీ ఓబీసీ బ్రాంచ్ సెక్రటరీ యాదగిరి సెక్రటరీ బి కోట సాంబయ్య, గుర్తింపు సంఘం నుంచి నజీర్ అహ్మద్, ప్రాతినిధ్య సంఘం తరపున కె. రామారావు ఇతర అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు.