11-04-2025 01:55:04 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలు ఆదర్శనీయమని కుల, లింగ వివక్షకు తావు లేకుండా, సమానత్వం ,విద్యా హక్కుల పరిరక్షణ ద్వారానే సామాజిక ఆర్థిక ఉన్నతికి బాటలు పడతాయని పూలే చూపిన మార్గం ఆదర్శమని, ఖానాపూర్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్య జాన్సన్ నాయక్ అన్నారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో పూలే జయంతి ఉత్సవాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో నాయకులు అబ్దుల్ కలీల్ ,కొక్కుల ప్రదీప్ ,దివాకర్, కారింగులు సుమన్ ,అడిదెల మహేందర్, పుపాల గజేందర్, శ్రావణ్. తదితరులు ఉన్నారు.