మందమర్రి,(విజయక్రాంతి): మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పాత బస్టాండ్ జయశంకర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విహెచ్పీఎస్ జాతీయ నాయకులు,బిసి కుల సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు పెద్దపల్లి సత్యనారాయణ మహాత్మ జ్యోతిరావు పూలే చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు.మహిళలకు విద్య నేర్పించాలనే లక్ష్యంతో ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసి స్త్రీ విద్య వ్యాప్తికి కృషి చేసినన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతి రావు పులే అని ఆయన సేవలను కొనియాడారు.
సమాజంలో కుల వ్యవస్థ నిర్మూలన జరగాలని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి అంటరానితనం నిర్మూలనకు కృషి చేశారన్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలు చదువు కునేందుకు ప్రోత్సహించి ప్రోత్సహించారన్నారు. బహుజనులు రాజ్యాధికారం సాధన దిశగా కృషి చేసి రాజ్యాధికారం సాధించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు సోత్కు సుదర్శన్,గజెల్లి లక్ష్మణ్, నోముల ఉపేందర్ గౌడ్,ముల్కల రాజేంద్ర ప్రసాద్,రామటెంకి దుర్గారాజ్, నూతి అంజయ్య,నీలం శ్రీనివాస్,బై రాజు శ్రీనివాస్, ఎనగందుల శ్రీనివాస్,గొర్రె రాజేంద్రప్రసాద్,మారు రమేష్,ఎండి నజీర్,ఎండి జావిద్ ఖాన్,సాదుల విద్యాసాగర్,ఎండి ఆఫీస్,వాసాల సాగర్,బండి రవి,సిరిపురం గణేష్,అట్లా భీమయ్య,వేముల శ్రీనివాస్,ఎండీ ఇసాక్ లు పాల్గొన్నారు