22-03-2025 12:00:00 AM
రాజేంద్రనగర్, మార్చి 21 (విజయ క్రాంతి): రాజేంద్రనగర్ మహా త్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవ కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. కమిటీ వ్యవస్థాపక అధ్యక్షు డు కే కృష్ణమాచారి, మాజీ కమిటీ అధ్యక్షులు డి. సత్యనారాయణ ముదిరాజ్, కే యాదయ్య, అడిగే అర్జున్, భంగి శ్రీను రఘుగౌడ్ సమక్షంలో నిర్వహించిన సమావేశంలో శివరాంపల్లి కి చెందిన బండారి శంకర్ ను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు.
ప్రధాన కార్యదర్శిగా రాజేంద్రనగర్ కు చెందిన ముడుమాల శ్రీకాంత్ ముదిరాజ్, కోశాధి కారులుగా పుంజాల శ్రీనివాస్ గౌడ్, వి చందు మీడియా సెల్ కన్వీనర్‌గా బుడిగెల బాబురావు లను ఎన్నుకున్నారు. ఉత్సవాలను అంగరంగ వైభ వంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.