11-04-2025 06:22:47 PM
మునగాల: సూర్యాపేట జిల్లా మునగాలలో మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి ఘనంగా నిర్వహించారు. శుక్రవారం మండల కేంద్రములో తాసిల్దార్ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ వలిగొండ ఆంజనేయులు మాట్లాడుతూ... విద్య ద్వారానే పేద వర్గాల అభ్యున్నతి సాధ్యమని భావించిన మహాత్మ జ్యోతిరావు పూలే దంపతులు ఆ దిశగా విద్యాలయాలు స్థాపించి సమాజంలో మార్పు కోసం పోరాటం చేశారని, వారు త్యాగాలు మరువలేవని ఎమ్మార్వో అన్నారు. సమాజంలో సమాన హక్కుల కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎంపీడీఓ రమేష్ దీన్ దయాల్ ఆన్నారు. ఈ కార్యక్రమంలో బుర్రి శ్రీరాములు, వెంకటాద్రి, తాసిల్దార్ సిబ్బంది, ఎండిఓ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.