calender_icon.png 22 April, 2025 | 12:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా కేంద్రంలో మహనీయులకు విగ్రహాలు ఏర్పాటు చేయాలి

21-04-2025 06:37:56 PM

నిర్మల్,(విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసం సామాజిక సేవ చేసిన బీసీ మహనీయులైన మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఏర్పాటు చేయాలన్నారు. బీసీ భవనం నిర్మించాలని ఆ సంఘం నాయకులు సోమవారం అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ కు వినతి పత్రం అందించారు. జిల్లా కేంద్రంలో వీరి విగ్రహాలు లేకపోవడం సూచనయమని ప్రభుత్వం వెంటనే స్పందించి విగ్రహాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు, ఈ కార్యక్రమంలో గణేష్, సతీష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.