11-04-2025 01:50:46 PM
కాటారం,(విజయక్రాంతి): మహాత్మ జ్యోతిరావు పూలే దంపతులకు భారతరత్న ప్రకటించాలని మలహర్ మండలం పూలే విగ్రహ కమిటీ చైర్మన్ విజయగిరి సమ్మయ్య కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar bhupalpally district) మలహర్ రావు మండలం కొయ్యూరు చౌరస్తాలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహ కమిటీ చైర్మన్ విజయగిరి సమ్మయ్య ఆధ్వర్యంలో 198వ జయంతిని ఘనంగా నిర్వహించారు. బలహీనవర్గాల పైన జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా, సమాజంలో మహిళపై వివక్షకు వ్యతిరేకంగా పూలే పోరాటం చేశారని గుర్తు చేశారు.
1948లో అమ్మాయిల కోసం ప్రత్యేకంగా స్కూలు ఏర్పాటు చేశారని , కుల మతాలకు అతీతంగా అందరికీ సమానంగా హక్కులు ఉండాలని పూలే పోరాటం చేశారని అన్నారు. పూలే సత్య శోధక్ సమాజ్ పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేసి, బలహీన వర్గాల తరఫున పోరాటం చేశారని అన్నారు. సామాజిక అసమానతల మీద ఆలు పెరగని పోరాటంతో పాటు, అనగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం, సమ సమాజ స్థాపనకై కృషి చేసిన సంఘ సంస్కర్త, తత్వవేత్త మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలు కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అయితే రాజిరెడ్డి, మాజీ జెడ్పిటిసి సభ్యురాలు కొండ రాజమ్మ, రజక సంఘం మండల అధ్యక్షులు పావురాల ఓదెలు, భద్రపు సమ్మయ్య, అజ్మీర సమ్మయ్య, లకావత్ సురేందర్, అయుబుద్దీన్, పులిగంటి రాములు, రాజయ్య, కొండూరు మమత, తిప్పల రజిత తదితరులు పాల్గొన్నారు.