calender_icon.png 20 April, 2025 | 4:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాత్మ జ్యోతిబాపూలె జయంతి వేడుకలు

12-04-2025 12:15:20 AM

 రాజేంద్రనగర్, ఏప్రిల్ 11: రాజేంద్రనగర్ లోని జూనియర్ కళాశాల సమీపంలో శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను కమిటీ అధ్యక్షుడు బండారి శంకర్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 

శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్, కుమార్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మాజీ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి, మాజీ రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.