11-04-2025 04:48:48 PM
బెల్లంపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి శాంతిఖనిలో మహాత్మ జ్యోతిబా పూలే జయంతి వేడుకలు శాంతిగని బీసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా గని ఆవరణలో ప్రతిష్టించిన మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహాన్ని బీసీ అసోసియేషన్ ప్రతినిధి, ఎస్ ఓ టు జిఎం విజయ్ ప్రసాద్ ఆవిష్కరించారు. అంతకు ముందు బీసీ పతకాన్ని ఆవిష్కరించారు. మహాత్మ జ్యోతిరావు పూలే సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బీసీ లైజన్ ఆఫీసర్ ముస్తఫా, ఏరియా ఇంజనీర్ వెంకట రమణ, ఎస్ టి లైజన్ ఆఫీసర్ జాదవ్ బాపు, బీసీ ఏరియా వైస్ ప్రెసిడెంట్ పిట్ట రాజు, అధ్యక్షుడు బీమరి వెంకటేష్, వైస్ ప్రెసిడెంట్ దాడి రమేష్, జనరల్ సెక్రటరీ శ్యామ్, ట్ట్రెజరర్ ఎంఏ ఖాదర్, జనరల్ షిఫ్ట్ ఇంచార్జి బి మొండి, ఏ వెంకటేష్, దేవా రమేష్,ఆడే. మహేష్, బీసీ అసోసియేషన్ నాయకులు, శాంతిఖని కార్మికులు పాల్గొన్నారు.