11-04-2025 08:11:50 PM
పిట్లం (విజయక్రాంతి): జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిట్లం మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ దఫెదర్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని, పూలే స్ఫూర్తిని కొనియాడారు. జిల్లా ఉపాధ్యక్షుడు నీలకంటి సంతోష్ మాట్లాడుతూ... పూలే భారతదేశ సామాజిక దృష్టికోణాన్ని మార్చిన సంచలన నేత, అట్టడుగు, పీడిత వర్గాల హక్కుల కోసం అహర్నిశలు పోరాడిన మహనీయుడు. విద్యే సమాజాన్ని మారుస్తుంది” అని స్పష్టం చేశారు.
దేశంలోనే మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించి మహిళా విద్యకు బాటలు వేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జుక్కల్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆకుల లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు చిప్ప శివ, ఎస్సీ సెల్ అధ్యక్షులు బుర్రెం బాలరాజు, సొసైటీ చైర్మన్ శపథం రెడ్డి, బిఆర్‌ఎస్ నాయకులు విజయ్, శ్రీనివాస్ రెడ్డి, బీసీ సంఘం సభ్యులు అప్రోజ్, సాయి కిరణ్, హనుమాన్లు, రోహన్, బాలరాజు, తదితరులు పాల్గొని పూలే సేవలకు ఘనమైన నివాళి అర్పించారు.