calender_icon.png 16 November, 2024 | 11:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాత్మ జ్యోతి బాపూలే పాఠశాలలో విద్యార్థిని మృతి

16-11-2024 09:05:07 PM

సంగారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): సంగారెడ్డి మండలంలోని కొత్లపూర్ గ్రామ శివారులోని మహాత్మ జ్యోతి బాపూలే పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శనివారం సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ లో పోలీసులకుపై ఫిర్యాదు చేయడం జరిగింది. తన్నీరు స్వాతి గత కొన్ని సంవత్సరాలుగా మహాత్మ జ్యోతి పూలే పాఠశాలలో చదువుతుంది. వీరి సొంత గ్రామం సదాశివపేటలోని మగ్దుం నగర్ ప్రస్తుతం వారి తల్లిదండ్రులు ఏఏ నగర్ లోని మదినగూడ కాలనీలో నివాసం ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వివరాలకు వెళ్తే... శనివారం 7.30 గంటలకు విద్యార్థిని తన తరగతి గదిలో ఫ్యానుకు చున్నీతో ఉరివేసుకొని చనిపోయిందని పాఠశాలలోని వార్డెన్ స్వాతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటహుటీన పాఠశాలకు బయలుదేరగా అప్పటికే తన్నీరు స్వాతి చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీని చేసుకొని శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించారు.

మృతదేహాన్ని తల్లిదండ్రులు రాకముందే మార్చురీకి పంపడం పట్ల పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ  ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా కమ్యూనిస్టు పార్టీలు పాఠశాల యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మార్చురీ వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు మాట్లాడుతూ.. మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో చనిపోయిన విద్యార్థిని కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే జిల్లాలోనే అనేక మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో విద్యార్థులు చనిపోతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా దారుణమాన్నారు. దాదాపు 6గంటల పాటు ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర అందోళన  నిర్వహించడంతో అధికారులు దిగివచ్చి చనిపోయిన విద్యార్థిని కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం, రూ.2 లక్షలు, ఇందిరమ్మ ఇల్లు, దహన సంస్కరణలకు రూ.50 వేల ఇవ్వడం జరిగింది.

మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో విద్యార్థినిలకు రక్షణ లేకుండా పోయిందని, విద్యార్థులకు రక్షణ కల్పించకపోతే పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో రక్షణ కల్పించాలని,  చనిపోయిన విద్యార్థిని పరామర్శించకుండా కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా వ్యవరించాడని మండిపడ్డారు. ప్రభుత్వ స్పందించి జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ని ఉద్యోగం నుంచి తొలగించాలని వాళ్లు డిమాండ్ చేశారు కేర్ టేకర్ను కూడా ఉద్యోగం నుండి   తొలగించాలని వాళ్లు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు సమస్య పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.