11-04-2025 08:41:08 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలంలోని అహమ్మద్ కళాశాలలో శుక్రవారం మహాత్మ జ్యోతిబాపూలే 199 వ జయంతి నీ ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు,చాత్రోపాధ్యాయులు జ్యోతిబాపూలే సమాజానికి చేసిన సేవలు కొనియాడారు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎండి హనీఫ్ పాషా మాట్లాడుతూ ఆయన త్యాగాలను, సమాజానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సామాన్యుడిగా మొదలై.. సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన పూలే జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. సామాజిక కార్యకర్తగా, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త పూలే భావి తరాలకు సైతం మార్గదర్శకుడని గుర్తు చేసుకున్నారు. సమాజంలో వివక్షకు తావు లేదని, సమానత్వం ఉండాలని జీవితాంతం పోరాడిన మహనీయుడు స్త్రీవిద్యను తాను చేసిన సేవలను స్మరిస్తూ అతని జీవితం అందరికీ ఆదర్శనీయమని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఛాత్రోపాధ్యాయులు పాల్గొన్నారు.