11-04-2025 07:45:25 PM
చెన్నూర్,(విజయక్రాంతి): చెన్నూరు పట్టణ కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి ఉత్సవాలను శుక్రవారం కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. మహాత్మ జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు చేన్న సూర్యనారాయణ, మాజీ మండల అధ్యక్షులు అంక గౌడ్, పాతర్ల నాగరాజ్, చెన్నూరి శ్రీధర్, లింగంపల్లి మహేష్, చెన్నూరు రాజేష్, చింతల శ్రీను, ఇస్మాయిల్, తిరుపతి, కరీం, తుంగ పిండి అనిల్, తగరం కృష్ణ, జక్కుల సత్తన్న, మదన్న, చింతల లక్ష్మణ్, అశోక్ గౌడ్, లచ్చన్న కాటం రాయుడు, మల్లక్క, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.