కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో మహత్మ జ్యోతిబాపూలే 134 వ వర్థంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద గల పూలే విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గంగారం మాట్లాడుతూ... మహత్మ జ్యోతిబాపూలే మహోన్నత వ్యక్తి అని సమాజ సమ నిర్మాణానికి ఆహర్నిశలు శ్రమించిన బహుజన శ్రామిక జన బాంధవుడన్నారు. బ్రాహ్మణాధిపత్య దోపిడి వ్యవస్థ సృష్టించిన అసమానతల కులవర్గ దోపిడీ వ్యవస్థపై నిత్యం తిరుగుబాటు చేసిన నాయకుడని, గులాం గిరి అనే పుస్తకాన్ని రచించి అక్షరమే ఆయుధంగా ఆజ్ఞానపు బానిసత్వ సంకెళ్లలపై సమరబేరి మోగించిన సామ్యవాది సామాట్ అశోక చక్రవరి వారసత్వానికి ప్రతిబింబమైన విశ్వజ్ఞాని ఆధునిక గౌతమ బుద్దుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వ్యక్తిని గురువుగా స్వీకరించరన్నారు. పూలే ఆశయ సాధనకై మనమంతా ఉద్యమించవలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో క్యాతం సీతారాములు, విఠల్, సందీప్, సాపశివరాములు, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.