11-04-2025 07:09:00 PM
చిలుకూరు: చిలుకూరు మండలం ఆచర్లగూడెం ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం మహాత్మ జ్యోతిబా పూలే జయంతిని ఆలోచన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ మొలుగూరి నాగరాజు మాట్లాడుతూ.. సమాజంలో ప్రతి ఒక్కరు చదువు ద్వారానే ఉన్నతమైన శిఖరాలను అధిరోహించవచ్చని, పూలే దంపతులు బడుగు బలహీన వర్గాలు చదువుకొని చైతన్యం కావాలనే ఉద్దేశంతో ఒకప్పుడు కొన్ని వర్గాలకే చదువుకునే అవకాశం ఉన్న రోజుల్లో విద్యాలయాలను నిర్మించి ప్రజలకు చదువుకునే అవకాశం కల్పించారన్నారు.
సమాజంలోని మూఢనమ్మకాలపైన, బాల్య వివాహాలపైన, పూలే ప్రజలలో చైతన్యం నింపారనీ ప్రతి ఒక్కరూ పూలే ఆశయాలను ముందుకు తీసుకపోవాలన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులకు ఏర్పాటు చేసిన సహా పంక్తి భోజనం కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బజ్జూరి నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు దొంగరి వెంకన్న, పంచాయతీ కార్యదర్శి గుండపనేని రామారావు, మైలారి శెట్టి పెద ఎలమందయ్య, నెమ్మాది కృష్ణయ్య, పారెల్లి సీతారాములు, అన్నదేవర శ్రీనివాస చారి, విద్యార్థినీ, విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు.