11-04-2025 04:55:08 PM
మోతే: మోతె మండల కేంద్రంలో శుక్రవారం పల్లెల పరివర్తన సొసైటీ చైర్మన్ పల్లెల లక్ష్మణ్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే 199 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎంపిడిఓ ఆంజనేయులు మాట్లాడుతూ.. ప్రతి మహిళ చదువు కోవాలని మహిళా చదువుతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆకాంక్షతో మొట్ట మొదటి సారిగా తన భార్య సావిత్రి భాయి పులేకు విద్యని నేర్పించి మొదటి గురువుగా తీర్చి దిద్దిన మహానుభావుడని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ లావణ్య, యస్ఐ యాదవేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి, కిసాన్ సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు వెలుగు వీరన్న, సిఆర్పిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు బొడ్డు సాలయ్య, ఏఐయుడబ్ల్యూసి జిల్లా చైర్మన్ డి చిరంజీవి, సోషల్ మీడియా మండల అధ్యక్షులు ఆర్వపల్లి గణేష్, పులి ఈదయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు గడ్డం రామి రెడ్డి, బొక్క ఉపేందర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ డి రాములు, సామ రామ్ రెడ్డి, కార్యదర్శి బక్కయ్య, పల్లెల రాము తదితరులు పాల్గొన్నారు.