గాంధీ జయంతిలో వక్తలు
విజయక్రాంతి న్యూస్ నెట్‌వర్క్, అక్టోబర్ 2: మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. కలెక్టరేట్లలో కలెక్టర్లు గాంధీ చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించారు. పలు ప్రాంతా ల్లో ఎమ్మెల్యేలు గాంధీ విగ్రహాలను ఆవిష్కరించి, నివాళులర్పించారు. స్వాతం త్య్ర పోరాటంలో మహాత్ముడి త్యాగాన్ని కొనియాడరు.
కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయ ఆవరణలో గాంధీ చిత్రపటానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ పూలమాల వేసి ఘనంగా నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ జీవితమే ఒక సందే శమని తెలిపారు.
మానవసేవే మాధవ సేవ అనే గాంధీ మాటలను ప్రతి ఒక్కరూ ఆదరించాలన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని కోరారు. మాజీ ప్రధానమంత్రి, భారతరత్న లాల్ బహదూర్‌శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ నివాళులర్పించారు.