calender_icon.png 3 April, 2025 | 11:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాత్మాగాంధీ ముని మనవరాలి కన్నుమూత

02-04-2025 10:24:45 AM

నవ్‌సరి,(విజయక్రాంతి): మహాత్మా గాంధీ ముని మనవరాలు నీలంబెన్ పరీఖ్(93) మంగళవారం నవ్‌సరిలో తుదిశ్వాస విడిచారు. మహాత్మా గాంధీ కుమారుడు హరిదాస్ గాంధీ మనవరాలి కుమార్తె అయిన నీలంబెన్ తన కుమారుడు డాక్టర్ సమీర్ పారిఖ్‌తో కలిసి నవ్‌సరి జిల్లాలో నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె నిన్న నవ్‌సిరిలో కన్నుమూశారు. బుధవారం ఉదయం 8 గంటలకు ఆమె నివాసం నుండి ఆమె అంత్యక్రియల ఊరేగింపు జరిపించి, వీర్వాల్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. నీలాంబెన్ గాంధేయ భావజాలాన్ని విశ్వసించిందని, ఆమె మహాత్మాగాంధీ బాటలోనే తన జీవితాన్ని వ్యారా (సేవ) కు అంకితం చేశారు. తన జీవితాంతం మహిళా సంక్షేమం, మానవ సంక్షేమానికి కృషి కోసం పనిచేశారు.