calender_icon.png 1 February, 2025 | 7:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మహాత్మాగాంధీ వర్ధంతి

31-01-2025 12:00:00 AM

సంగారెడ్డి, జనవరి 30 (విజయ క్రాంతి) : మహాత్మ గాంధీ వర్ధంతిని సంగారెడ్డి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. గురువారం మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు గాంధీ విగ్రహాలకు వినతి పత్రం సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన 420 హామీలు అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి, జహీరాబాద్, ఆందోల్, నారాయణఖేడ్, పటాన్చెరు నియోజకవర్గాలలో గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు పోరాటం చేస్తామని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, కొన్నింటి మాణిక్ రావు, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్ తో పాటు బీఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.