29-04-2025 07:49:05 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని అన్ని మండలాల్లో బుధవారం విశ్వ గురువు మహాత్మా బసవేశ్వర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు వీరశైవ లింగాయత్ జిల్లా కమిటీ సభ్యులు మారుతి పటేల్ సాయి పటేల్ కామన్ అప్పటేలు తెలిపారు. ప్రభుత్వం అధికారికంగా ఈ వేడుకలను నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో ప్రతి మున్సిపాలిటీలో మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయంలో బసవేశ్వర జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని ఎందుకు అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు.
కలెక్టర్ కార్యాలయంలో అధికారికంగా జయంతి..
నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 10:30 నిమిషాలకు అధికారికంగా నిర్వహించే వేడుకలకు జిల్లా కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్ లింగాయత్ సమాజ్ సభ్యులు వివిధ కుల సంఘాల నేతలు హాజరుకావాలని పిలుపునిచ్చారు.