26-02-2025 12:00:00 AM
నేడు శివపార్వతుల కల్యాణం
కడ్తాల్, ఫిబ్రవరి 25 ( విజయ క్రాంతి ) : కాశీవిశ్వనాథస్వామి బ్రహ్మోత్సవాలకు కడ్తాల్ మండలం మైసిగండి శివాలయం ముస్తాబయింది. ఏటా మహా శివరాత్రిని పురస్కరించుకుని ఉత్స వాలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితిగా కొనసాగు తోంది.
ఇందులో భాగంగా మంగళవారం ఉత్సవాలు ప్రారంభ మయ్యాయి. శివరాత్రి మహా పర్వదినం పురస్కరించుకొని రెండు రోజులు ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొన సాగనున్నాయి. సాంప్రదాయంగా జపహోమ పూజలు, అభిషేక అర్చనాది సేవలను ఆగమ శాస్త్రానుసారంగా నిర్వహించేందుకు ఆలయ అధి కారులు ఏర్పాట్లు చేశారు.
కార్యక్రమాల వివరాలు ఇలా..
విఘ్నేశ్వరపూజ, ధ్వజారోహణం, స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం. 26న శివపార్వతుల కల్యాణం, రాత్రి 12 గంటలకు ప్రత్యేక అభిషేకాలు, తదుపరి స్వామివారికి రథో త్సవం. 27న స్వామివారికి ఏకాదశ కలశాభిషేకం, వసంతోత్సవం అవబృతం, పూర్ణాహుతి కార్యక్ర మాలతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ ఈఓ స్నేహలత, ట్రస్టీ చైర్మన్ శిరోలిపంతూ తెలిపారు.