25-02-2025 07:06:06 PM
సీఐ నరేందర్..
లక్షెట్టిపేట (విజయక్రాంతి): మహాశివరాత్రి వేడుకల్లో భక్తసంద్రానికి ఏలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని సీఐ నరేందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శివరాత్రి సందర్భంగా గోదావరి నది వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ నరేందర్ మాట్లాడుతూ.. నీటిమట్టం ఎక్కువగా ఉన్నందున లోతట్టు ప్రాంతాలకు భక్తులు స్నానాలకు వెళ్లకూడదన్నారు. గోదావరి వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచామన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. భక్తులు దొంగల బారిన పడకుండా తమ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ నరేందర్ తో పాటు ఎస్సై సతీష్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.