- చదువుల తల్లిగా, జ్ఞాన దేవతగా ప్రసిద్ధికెక్కిన శ్రీ మహాసరస్వతి అమ్మవారు
చిన్నారుల అక్షరాభ్యాసానికి, పుస్తక పూజలకు శ్రీమహాశక్తి దేవాలయంలో ఏర్పాట్లు పూర్తి
కరీంనగర్, ఫిబ్రవరి2 (విజయక్రాంతి): కరీంనగర్ చైతన్యపురిలోని మహిమాన్విత శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహా సర స్వతి అమ్మవార్ల దివ్య క్షేత్రం వసంత పంచ మి వేడుకలకు ముస్తాబైంది. చదువుల తల్లి గా, జ్ఞాన దేవతగా ప్రసిద్ధికెక్కి , చిన్నారుల అక్షరాభ్యాసానికి కొంగుబంగారంగా మారిన ఇక్కడి మహాసరస్వతి అమ్మవారి కోవెలలో వసంత పంచమి వేడుకలను అంగరంగ వైభ వంగా నిర్వహించడానికి ఆలయ నిర్వాహకు లు తగిన ఏర్పాటు చేశారు.
జగద్గురు శంక రాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు విద్యారణ్య భారతి స్వామి వారి ఆశీస్సులతో ఫిబ్రవరి 3వ తేదీ సోమ వారం రోజున వసంత పంచమి సందర్భం గా శ్రీ మహాశక్తి దేవాలయంలో పూజా కార్య క్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు.
కార్యక్రమముల వివరములు
ఉదయం 4 గంటలకు శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్ల మూల మూర్తులకు అభిషేకం, ఉదయం 7 గంటలకు శ్రీ మహాసరస్వతి దేవి పూజ, అభి షేకం, కుంకుమార్చన, ఉదయం 8 గంటల నుండి విద్యార్థులచే సామూహిక పుస్తక పూ జలు, అక్షర స్వీకారములను చేపట్టనున్నారు.