calender_icon.png 20 November, 2024 | 4:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాసభ ఆవశ్యకత

01-08-2024 12:00:00 AM

 పోలీసు కిష్టయ్య :

తెలంగాణ రాష్ట్ర సాధన చరిత్రలో పోలీసు కిష్టయ్య పేరు ‘తొలి అమరునిగా’ నమోదు కాలేదు. ఇందుకోసం మన నాయకులు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. తొలి అమరునిగా శ్రీకాంతాచారి పేరును ప్రభుత్వం నమోదు చేసింది. దిల్‌సుఖ్‌నగర్‌లో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కానీ, పోలీసు కిష్టయ్య విగ్రహాన్ని నెలకొల్పాలని ఇంతవరకూ ఎవ్వరినీ అడిగిందీ లేదు.

దాదాపు ఐదు సంవత్సరాలపాటు  2009 నుండి 2014 వరకు ఉవ్వెత్తున ఎగిసిన చివరిదశ ‘తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం’లో ముదిరాజులు నిర్వహించిన పాత్ర, చేసిన త్యాగాలు, అనుభవించిన కష్టాలు చరిత్రలో మరిచిపోలేనివి. మలిదశ ఉద్యమంలో తొలి అమరునిగా పోలీసు కిష్టయ్య చేసిన త్యాగం అనితర సాధ్యమైంది. కానీ, తెలంగాణ రాష్ట్ర సాధన చరిత్రలో పోలీసు కిష్టయ్య పేరు ‘తొలి అమరునిగా’ నమోదు కాలేదు. ఇందుకోసం మన నాయకులు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. తొలి అమరునిగా శ్రీకాంతాచారి పేరును ప్రభుత్వం నమోదు చేసింది. దిల్‌సుఖ్‌నగర్‌లో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కానీ, పోలీసు కిష్టయ్య విగ్రహాన్ని నెలకొల్పాలని ఇంతవరకూ ఎవ్వరినీ అడిగిందీ లేదు.

అట్లాగే, వరంగల్ జిల్లాలో తోడేళ్ల నాగరాజు, నల్గొండ జిల్లాలో దుద్యాల శ్యాం కుమార్లతోపాటు దాదాపు 86 మంది ముదిరాజ్ బిడ్డలు తెలంగాణ సాధనకోసం సమిధలయ్యారు. కనీసం తెలంగాణ అమరుల కుటుంబాలను పరామర్శించే కనీస ధర్మాన్ని కూడా మన నాయకులు పాటించలేదు. ఉస్మానియా, కాకతీయ, పాలమూ రు, శాతవాహన తదితర విశ్వవిద్యాలయాల, కళాశాలల విద్యా ర్థులు తెలంగాణ కోసం వీరోచితమైన పోరాటాలలో భాగస్వాములయ్యారు. నాయకత్వం వహించా రు. నెలల తరబడి జైళ్లలో మగ్గారు. వందలాది కేసులను మోస్తున్నారు. అన్ని కులాల నాయకులు తమ కులాలకు చెందిన విద్యార్థులు జైళ్ల పాలైతే మందీ మార్బలంతో వెళ్లి తమ కులం విద్యార్థి నాయకులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. బెయిల్ మంజూరు చేయించేందుకు సహాయపడ్డారు. కానీ, మన ముదిరాజ్ బిడ్డలు నెలల తరబడి జైళ్లలో మగ్గుతుంటే కనీసం పలకరించిన పాపాన పోలేదు. (అవినీతి ఆరోపణలతో జైలు పాలైన వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని మాత్రం జైలుకు వెళ్లి కలిసివచ్చిన ‘ఘన’ చరిత్రను మన నాయకులు మూట గట్టుకున్నారు.)

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాలు పంచుకోకుండా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములయ్యే నైతిక హక్కు ఉండదు. ముదిరాజ్ జాతి మొత్తం తెలంగాణ ఉద్యమంలో అనేక రూపాల్లో పాల్గొన్నది. ఉద్యమంలో భాగంగా గ్రామాలలో, మండలాలలో, జిల్లా కేంద్రాలలో నిర్వహించిన కార్యక్రమాలు, ధర్నాలు, నిరాహార దీక్షలు, ఊరేగింపుల్లో ముదిరాజులు వేలాదిగా పాల్గొన్నారు. తమ వంతు పాత్రను ఉద్యమంలో నిర్వహించారు. అయితే, రాష్ట్ర స్థాయిలో ‘ముదిరాజ్ మహాసభ’ తెలంగాణ జేయేసీ ఇచ్చిన ఏ కార్య క్రమానికీ స్పందించిన దాఖలాలు లేవు. ముదిరాజ్ మహాసభ తరపున ఉద్యమ కార్యక్రమానికి పిలుపును ఇచ్చిన సందర్భం కూడా ఏదీ లేదు. ముదిరాజులు ఎక్కడికక్కడ, ఎవరికి వారుగా ఉద్యమంలో పాల్గొ న్నారే తప్ప ఒక కులసంఘంగా తెలంగాణ ఉద్యమంలో నిర్వహించిన పాత్ర ఎక్కడా కనిపించలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర

ప్రదేశ్’ ఉమ్మడి పేరుమీద ఉనికిలో ఉన్న కులసంఘాలన్నీ ‘తెలంగాణ’ పేరుమీద తమ సంఘాల పేర్లను మార్చుకుంటే, ఒక్క ‘ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ’ మాత్ర మే తెలంగాణ పేరుమీద తమ కులసంఘం పేరును మార్చుకోలేదు. ఈ పరిణామాల ఫలితంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముదిరాజుల పాత్ర ప్రశ్నార్థకంగా మారిపోయింది. ముదిరాజులు స్వతంత్రంగా చేసిన ఉద్యమాలు, ప్రాణత్యాగాలు తెలంగాణ రాష్ట్రసాధన చరిత్రలో నమోదు కాలేదు.

’కులబలం’ ఆధారంగా నిలబడే ఏ జాతికైనా సమాజంలో గౌరవ, మర్యాదలు దక్కాలంటే ఆ కులానికి జీవనాధారంగా ఉపయోగపడే కులవృత్తిని నిలబెట్టుకునేందుకు సదరు కులసంఘం ప్రత్యేక దృష్టితో కృషి చేయాలి. కానీ, ముదిరాజులు మత్స్యకారులు కాదనే దురభిప్రాయాన్ని బలపర్చే విధంగానే మన కులసంఘాల నాయకులు ఇంత కాలంగా మన వృత్తిపట్ల నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సుమారు 4 వేల మత్స్యకారుల సొసైటీలలో దాదాపు 3,200 సొసై టీలు ముదిరాజుల నాయకత్వంలో ఉంటే, రాష్ట్ర మత్య్సకారుల సొసైటీకి ఇంతవరకూ ఒక్క ముదిరాజు చైర్మన్ కాలేకపో యారు. దీన్నిబట్టి, మన నాయకత్వ పటిమ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు.

జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ (నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు-: ఎన్‌ఎఫ్‌డీబీ) కేంద్ర కార్యాలయం హైదరాబాద్ లోనే ఉన్నప్పటికీ ఇప్పటి వరకూ ఈ బోర్టులో తెలంగాణ ప్రాంతం నుండి ఒక్క రు కూడా సభ్యులుగా నామినేట్ కాలేదంటే మన నాయకత్వం ఎంతటి దారుణ దీనావస్థలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ’ఎన్‌ఎఫ్‌డీబీ’ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం మత్స్యకారులకు అందుబాటులోకి రావడం లేదు. ఇతర కులాలకు చెందిన నిరుపేదలు కూడా మత్స్యకారులుగా మారి, మత్స్యకారుల సొసైటీలలో సభ్య త్వం పొంది, వంశపారంపర్యంగా చేపల పెంపకం మీద ఆధారపడిన ముదిరాజులకు అనేక రకాలుగా ఇబ్బందులు కలిగి స్తున్నారు. ఈ విషయంలో మన నాయకులు ఎలాంటి చొరవను ప్రదర్శించిన దాఖలాలు కనిపించడం లేదు.

మరోవైపు తెలంగాణలోని అనేక జిల్లాలలో ‘గ్రానైట్’ మాఫియా చేతిలో గుట్టలన్నీ మాయమైపోతున్నాయి. గుట్టలమీద పండ్లు, ఫలాలు ఏరుకుని జీవితాలు గడుపుతున్న తెనుగోళ్ల జీవనాధారం మాయమై పోయింది. గుట్టల నుండి జాలు వారే ప్రవాహం ఆధారంగా నిండే చెరువులు చేపల పెంపకానికి ఉపయోగపడేవి. గుట్టలు అంతరించి పోవడంతో చెరువులలో నీరెండి పోయి ముదిరాజులు జీవనాధారం కోల్పోయారు. ఈ విపరిణామాల మీద మన నాయకులు ఇంతవరకూ నోరు విప్పిన సందర్భాలు లేనే లేవు.

కనీసం ‘గ్రానైట్ మైనింగ్’ కారణంగా ముదిరాజుల జీవితాలు నాశనమవుతున్నాయనే వాస్తవాలై నా మన ఘనత వహించిన ముదిరాజ్ నాయకులకు తెలుసా! ఇవన్నీ తెలియాలంటే కులసంఘానికి నాయకత్వం వహి స్తున్న వాళ్లు కులవృత్తిని గురించి కాపాడుకునేందుకు కులసంఘం ప్రత్యేక శ్రద్ధతో వ్యవహరించాలి. కానీ, ముదిరాజులు తమ కులదేవతగా కొలిచే ‘పెద్దమ్మ తల్లి’ రాష్ట్రమంతటా ముదిరాజులతో పూజలందు కుంటుంటే, రాజధాని హైదరాబాద్‌లో మాత్రం అగ్రకులాల ఆధిపత్యంలో మగ్గుతున్నది. హైదరాబాద్‌లోని ‘పెద్దమ్మ తల్లి’ని అగ్రకులాల బారినుండి కాపాడే కనీస ప్రయత్నం కూడా మన కులసంఘం నుం డి జరగలేదు. కులదేవతకే అగ్రకుల ఆధిపత్యం నుండి విముక్తి కలిగించలేని కుల సంఘం నాయకులు కుల ప్రజలను ఎలా రక్షించగలరు!? అందుకే, తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావం- అవసరం.

 పల్లెబోయిన అశోక్,

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, 

తెలంగాణ ముదిరాజ్ మహాసభ