సూర్యాపేట, అక్టోబర్ 27 : సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్ పట్టణం ఆదివారం భక్తిపారవశ్యంతో మునిగితేలింది. పట్టణ పరిధిలోని ఎన్నెస్పీ క్యాంప్ ఉన్నత పాఠశాల ఆవరణలో 45 మంది నాగ సాధువులు స్వయంగా ఎనిమిది అడుగుల మృత్తిక (మట్టి) శివలింగాన్ని తయారు చేశారు. సాయంత్రం శివలింగానికి జల, ఫల, పుష్ప, కుంకుమ, సింధూరం, ఆవు నెయ్యి, ఎండు ద్రాక్ష, జీడి పప్పు, పండ్ల రసాలు, మారేడు దళాలు, నవగ్రహ దినుసులతో మహా రుద్రాభిషేకం చేశారు. ఈ వేడుకను చూసేందుకు పట్టణవాసులు భారీగా తరలివచ్చారు. శివనామ స్మరణతో మార్మోగింది.