ఎమ్మెల్యే విజయరమణారావు
మంథని, జూలై 8(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలో పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణా నికి అడుగులు పడుతున్నాయని, ఈ రిజర్వాయర్ పూర్తయితే జిల్లాకు మహర్దశ పట్టుకు న్నట్లేనని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సోమవారం ఎస్సారెస్పీ ఉన్నతాధికారులతో పెద్దపల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా రైతుల చిరకాల స్వప్నం అయిన పత్తిపాక రిజర్యాయర్ నిర్మాణమే ధ్యేయంగా ముం దుకు సాగుతున్నామని ఎమ్మెల్యే చెప్పారు. 7.78 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని కోరారు. దేవికొండ రిజర్యాయర్ నుంచి లిఫ్ట్ ద్వారా, గ్రావిటీ కెనాల్ ద్వారా కూడా నీటిని సరఫరా చేసేలా ప్రతిపాదనలు వారం రోజుల్లో తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సీఈ సుధాకర్‌రెడ్డి ఈఈ పంతూ, ప్రకాష్‌రావు, జెఈ హరీష్, మోతె ప్రాజెక్టు మేనేజర్ కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.