calender_icon.png 24 January, 2025 | 1:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముచ్చర్లకు మహర్దశ!

01-08-2024 02:19:04 AM

ఇప్పటికే అనేక భారీ పరిశ్రమల ఏర్పాటు

తాజాగా స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ

నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

రంగారెడ్డి, జూలై 31 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని ముచ్చర్ల ఫార్మాసిటీ ప్రాంతానికి మహర్దశ రానున్నది. నియోజకవర్గంలో ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఐటీ, ఫ్యాబ్‌సిటీ లాంటీ ప్రముఖ కంపెనీలు వెలిశాయి. ఈ ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం ఉండటంతో పారిశ్రామిక వేత్తలు క్యూకడుతున్నారు. ఈ క్రమం లో అంతర్జాతీయ స్థాయిలో స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభు త్వం శ్రీకారంచుట్టింది.

కందుకూరు మండలంలోని మీర్‌ఖాన్ పేట్ రెవెన్యూ పరిధిలో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములు సర్వే నంబర్ 112 లో 57 ఎకరాల్లో వర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల వర్సిటీ స్థలాన్ని పరిశీలించారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో అమెజాన్ డాటా కేంద్రం, 765 కేవీ పవర్ గ్రిడ్, 100 ఎకరాల్లో 400 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్లు నిర్మా ణంలో ఉన్నాయి. గత ప్రభుత్వం మెడికల్ కళాశాల ఏర్పాటుకు శంకుస్థాపన చేయడంతోపాటు లా యూనివర్సిటీని కుడా ప్రకటిం చింది. స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ ఏర్పాటుతో నిరుద్యోగ సమస్య తొలగిపోతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.