calender_icon.png 10 March, 2025 | 11:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్గత రోడ్లకు మహర్దశ

10-03-2025 12:00:00 AM

రహదారుల నిర్మాణానికి రూ.4.25 కోట్లు మంజూరు

మానకొండూరు, మార్చి9 (విజయక్రాంతి): మానకొండూర్ నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అంతర్గత రహదారుల నిర్మాణానికి    రూ.4.25 కోట్లు  మంజూరైనట్టు  ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారా యణ తెలిపారు. 

మానకొండూరు మండలానికి రూ.1.20 కోట్లు

మానకొండూరు మండలానికి కోటి 20 లక్షలు మంజూరు కాగా ఊటూరుకు గ్రామానికి 25 లక్షలు, పచ్చునూరుకు 35 లక్షలు, రంగపేట్ కు 25 లక్షలు, లలితాపూర్ కు 15 లక్షలు, నిజాయితీ గూడెంకు 20 లక్షలు మంజూరైనట్టు ఆయన వివరించారు. 

తిమ్మాపూర్ మండలానికి రూ.1.80 కోట్లు

తిమ్మాపూర్ మండలానికి కోటి 80 లక్షల రూపాయలు మంజూరైనట్టు ఎమ్మెల్యే తెలిపారు.  తిమ్మాపూర్ గ్రామానికి 15 లక్షలు, మహాత్మా నగర్ కు 70  లక్షలు, నల్లగొండకు 40 లక్షలు, పోలంపల్లికి 10 లక్షలు,మల్లాపూర్ కు 10 లక్షలు,కొత్తపల్లికి 20 లక్షలు వెరసి కోటి 80 లక్షలు మంజూరైనట్టు ఆయన వివరించారు. 

శంకరపట్నం మండలానికి రూ. 1.05 కోట్లు

శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి  20 లక్షలు, మెట్ పల్లి గ్రామానికి  200 లక్షలు, అంబాలాపూర్ కు 10 లక్షలు, కన్నాపూర్ కు  10 లక్షలు, కేశవపట్నానికి 10 లక్షలు , కరీంపేట్ కు 10 లక్షలు, ముత్తారం గ్రామానికి 15 లక్షలు, వెరసి శంకరపట్నం మండలానికి మొత్తం కోటి 5 లక్షలు మంజూరైనట్టు  వివరించారు.

గన్నేరువరం మండలానికి రూ.20 లక్షలు

గన్నెరువరం మండలానికి మొత్తం 20 లక్షలు మంజూరు కాగా గుండ్లపల్లి కి పది లక్షలు మాదాపూర్ కు 5 లక్షలు, చొక్కారావు పల్లెకు ఐదు లక్షలు మంజూరైనట్లు ఆయన వివరించారు.