calender_icon.png 25 December, 2024 | 6:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జహీరాబాద్‌కు మహర్దశ

30-08-2024 12:47:43 AM

దేశవ్యాప్తంగా 12 పట్టణాల్లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయంలో భాగంగా  తెలంగాణలోని జహీరాబాద్‌లో  పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేయడం ఎంతో సంతోషించదగ్గ విషయం. దాదాపు  3,245 ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే ఈ కారిడార్ కోసం రూ. 2,361 కోట్లను వెచ్చించనున్నట్లు  కేంద్రం ప్రకటించింది. దీనిద్వారా 1.74 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేశారు. వాస్తవానికి జహీరాబాద్‌లో ఇప్పటికే పలు పారిశ్రామిన యూనిట్లు ఏర్పాటు అయ్యాయి.

అంతేకాదు ఈ పట్టణం రీజినల్ రింగ్‌రోడ్( ఆర్‌ఆర్‌ఆర్)కు చేరువలో ఉండడంతో  చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడుతుంది.  జహీరాబాద్ తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండడం కూడా కలిసొచ్చే అంశం.  కారిడార్ ఏర్పాటుతో పట్టణంలో పారిశ్రామికాభివృద్ధి అత్యంత వేగంగా జరిగే అవకాశం ఉంది. వెనుకబడిన జిల్లాల్లో ఒకటయిన ఉమ్మడి మెదక్ జిల్లా అంతా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. రాష్ట్రాభివృద్ధికి దోహదపడే  కేంద్ర నిర్ణయాన్ని అన్ని రాజకీయ పార్టీలు స్వాగతించాల్సిన అవసరం ఎంతయినా ఉంది.

  రాజేశ్, సంగారెడ్డి